ప్రపంచం నీ బానిస
-------------------------------------------------------------------------------------------------
గుండె లోతులో కలల మాటున వెదుకు... దొరుకుతుంది నీ గమ్యం,
తెలుస్తుంది నీ లక్ష్యం
కండ బలంతో ప్రగతి పధంలో నడువు.... దొరుకుతుంది నీ గమ్యం,
తెలుస్తుంది నీ లక్ష్యం
ఎలాగూ ఒక రోజున పోయే శరీరం
నీ సర్వం సమర్పించి సాధిస్తే పోయేదేముంది
తర తరాల జడత్వo, పనికిరాని అలసత్వం తప్పితే.
ఎందరో వస్తారు, ఎందరో పోతారు రోజూ, కోట్లమందిని చూస్తుంది
మోస్తుంది ఈ భూమి
అలా కూర్చుంటే నీకు రాయికి ఏంటి తేడా
నిజాలు మాట్లాడితే, నువ్వు ఉన్నా పోయినా పెద్ద తేడా ఏముండదు
ఈ ప్రపంచానికి
కానీ మనిషి అన్న వాడు తలిస్తే , కలల్ని కలిపి శ్రమిస్తే,
ఏమి సాధించగలడో
ఈ ప్రపంచానికి చూపగలిగే అద్భుత అవకాశం నీ జీవితం
ఒకే ఒక్కసారి వాడగలిగే పరికరం నీ జీవితం
విన్న కధలనే వింటూ , నిన్న నిజాలే కంటూ , నిలుచుండి పోతావా
నూతన శకాన్ని ఆరంభిస్తావా? నీ చరిత్ర నువ్వే లిఖించవా ?
నీ కల ఏదైనా, నీ కధ ఏదైనా.... నిర్భయం గా వెళ్ళు
వెతకాల్సింది నువ్వే ... గెలవాల్సింది నువ్వే
నేటి నిజాలూ... నిన్నటి కొందరి కలలే
సరిగ్గా చూడు ... నిన్నాపే సంకెళ్ళు ఏమి లేవు నీ చేతికి..
కసిగా కదులు.....ధైర్యంతో నడువు.... ప్రపంచం నీ బానిస.
-
కొసనం నాగ చైతన్య
13th
July 2013, Kolkata
No comments:
Post a Comment