Sunday, March 19, 2017

Karige ee kaalam... Niluvadu nee kosam..


కరిగే ఈ కాలం ... నిలవదు నీ కోసం....
కరగని నీ కలతో ... నువ్వే పరుగెత్తాలి...
కదిలే ఈ లోకం ... వినదే నీ శోకం ....
చెరగని నీ నవ్వే ... నీకు బలమవ్వాలి ....

రాతిరి మాటున సూరీడు ...నిలబడిపోడు ఏనాడూ...
రేయిని చీల్చుకు ప్రతిరోజు ఉదయిస్తాడు

నిప్పై మండే కల తోడు... నింగిని తాకేయ్ ఈనాడు...
అలలా ఎగసి అనునిత్యం నువ్ పోరాడు ...

|| కరిగే ఈ కాలం ||

నేలన నాటిన విత్తైనా .... చుట్టూ ఉన్నది మట్టైనా ...
మొక్కగా మారి చెట్టుగ ఎదిగే మార్గం తపనేగా ....

కష్టం అయితే ఇష్టం లా .... నష్టం అన్నది ఉంటుందా....
చెట్టుగ మారి నీడను పంచేయ్ .. వర్షం జత రాగా ...

ఉలి పోట్లెన్నో పడుతున్నా .. సమ్మెట భారం నెడుతున్నా...
ఓర్పుగా నేర్పుగా ఓరిమి చూపే  శిల్పం కధనే వినరావా ...

|| కరిగే ఈ కాలం ||
- Kosanam Naga Chaitanya


No comments: